Pravachana Mantapam and Satyanarayana Swami Temple in Hyderabad Uppal
🕉️🕉️🕉️ గురు సంకల్పం - మన కర్తవ్యం 🕉️🕉️🕉️
భాగ్యనగరం లో నూతన ప్రవచన వేదిక ఏర్పాటు

శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యోనమః
పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి జయము జయము.
భాగ్యనగరం లో మన పీఠం తరపున నిత్యం ప్రవచనములు జరుగుటకు ప్రవచన మండపం అద్దెకు తీసుకోవడం కష్టం అవుతున్నది. కానీ అష్టాదశ పురాణములు ప్రవచనాలు గా చెప్పాలన్న సంకల్పం ఉన్నప్పుడు, అనేక సామూహిక క్రతువులు జరుపుకునేలా స్థలం ఏర్పాటు చేయాలన్నా మనం ప్రస్తుతం ఏర్పాటు చేసుకున్న అరుణాచలేశ్వర సన్నిధి కి మించిన స్థలం అవసరం ఉన్నది.
ఒక స్థిరమైన, మనదైన వేదిక ఏర్పాటు ఐతే భవిష్యత్తు లో జరిగే ప్రవచనాలను అక్కడే ఏర్పాటు చేసుకోవచ్చు అన్నది గురుదేవుల సత్సంకల్పం.
వారు సంకల్పం చేస్తే నిజమవుతాయి అనడానికి నిలువెత్తు నిదర్శనం ఎత్తైన ధ్వజ స్తంభం, ఎప్పటికప్పుడు ఒక్కొక్క సంవత్సరం ఒక్కో ఆలయం పీఠంలో ఏర్పడటం మనం చూస్తూనే ఉన్నాం. గత రెండు మూడు ఏండ్లలోనే నూతనంగా సత్యధర్మేశ్వర, పద్మేశ్వర స్వామి వారి ప్రాంగణం, ఏలూరు లో ప్రవచన వేదిక సిద్ధమయ్యాయి.
ఒక సంవత్సరం తిరగకుండానే సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఏర్పాటయింది. భాగ్యనగరం లో అరుణాచలేశ్వర సన్నిధి, బెంగళూరు లో గురు సన్నిధి సంకల్ప మాత్రం చేత ఏర్పాటు అయ్యాయి అని మనమంతా కళ్ళారా చూసాం. నమస్కరించుకున్నాం.
భాగ్యనగరం లో విశాలమైన, నూతన ప్రవచన వేదిక ఏర్పాటు చేసే సంకల్పం కోసం మన వంతుగా అన్నీ రకాలుగా అంటే ధన కనక రూపేణ పీఠానికి సమర్పిస్తే మనకు ఒక ప్రవచన మండపం ఏర్పాటు అవుతుంది. మేము ఏ సాయం చేయలేము అనుకున్న వారు మాట సాయంగా వ్యూహలక్ష్మీ మంత్రం మరియు వసుధా మంత్రం జపం చేసి గురుదేవుల సంకల్పం త్వరగా నెరవేరాలని కోరుకుందాం.
సత్సంగ సభ్యులు అందరూ సహకరించాలని కోరుతూ మరిన్ని వివరాలకు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్
224 542 9017 — Ramesh Nekkanti (USA Contact)
9962468356 — Ashok Kumar (Preferably WhatsApp Text Message)
9440116638 — Sri Pranava Peetam
Payment Bank Account
HDFC Bank
Account type — Current account
Account Number — 50200067159590
Account Holder’s Name — Sri Pranava Peetham
IFSC Code — HDFC0009158
గమనిక - చాలామంది భక్తులు ప్రవచనం కోసం, సామూహిక వ్రతములు, భజనలు, పూజల కోసం కనీసం 300 మందికి పైగా పూజలు చేసుకునేలా ఒక మండపం ఉంటే బాగుండు అని కోరడం వల్ల ఇలా గురుదేవులు సంకల్పించారు.
యథాశక్తి సమర్పించి ఈ అపూర్వ భగవత్ యజ్ఞంలో పాలుపంచుకున్న వారు తమ గోత్రనామాలను దిగువన ఉన్న ఫారం లో నింపగలరు.
Link to view Bhoomi Pooja Photos →
Location: 1/4th KM to Hyderabad Uppal Guruvugari Peetham.
All Donations Qualifies under Non-profit 501(C) Tax Exemption. Tax code: 92-1792254, and India Pranava Peetham Non-Profit section 8(c).